Wednesday 6 April 2016

రాజకీయాల్లోకి వచ్చేస్తా


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర ప్రకటన చేశారు. త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ తనకు బంధువులేనని అన్నారు. ప్రజాప్రతినిధులు - అధికారుల అవినీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో సత్సంబంధాలు ఉన్న మోహన్ బాబు ఆయన పార్టీ స్థాపించిన సమయంలో సత్సంబంధాలు కొనసాగించారు. అనంతర పరిణామాల్లో చంద్రబాబుతోనూ సఖ్యతగా ఉన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనతో ఒకింత ఎడం పాటించారు. ఇదే సమయంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెతో తన పెద్ద కుమారుడు మంచు విష్ణుకు వివాహం జరిగిన నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. ఇప్పటికీ వైఎస్ ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజా ప్రకటన ఆసక్తిని కలిగిస్తోంది.

తమ్ముడి కోసం సూపర్ స్టార్ ను కలవాలి



తనే ఓ పన్నెండేళ్ల చిన్న పిల్ల. ఇక 8 ఏళ్ల తమ్ముడేమో పుట్టుకతోనే చూపును కోల్పోయాడు. ఎలాగో దేవుడ్ని నాలుగు సంవత్సరాల నుండి నాకు చూపునివ్వు బాబోయ్ అని అడుగుతున్నా.. ఆ పిల్లాడికి దేవుడు చూపు ఇవ్వట్లేదు కాబట్టి.. ఇప్పుడు ఆ పిల్లాడు కనీసం షారూఖ్ ఖాన్ ను అయినా కలవాలని కోరుకున్నాడు. దేవుడు తీరుస్తాడో లేదో తెలియదు కాని.. ఆ పిల్లాడి అక్క మాత్రం ఆ కోరికను తీర్చాలని ఫిక్సయ్యింది. 

క్లుప్తంగా చెప్పాలంటే ''ధనక్'' అనే సినిమా కథ అదే. ఇక్బాల్- దోర్ వంటి సినిమాలను రూపొందించిన నగేష్ కుకునూర్.. ఇప్పుడు ఈ సినిమాను రూపొందించాడు. ఆ ట్రైలర్ ను చూస్తే స్వయంగా షారూఖ్ ఖాన్ కే షాక్ కొట్టినంత పనైందట. వెంటనే మనోడు అద్భుతం అంటూ తన సోషల్ నెట్వర్క్ పేజీ ద్వారా అందరికీ దానిని షేర్ చేసి ఆ పిల్లలకు అభినందనలు తెలిపాడు. అలాగే నగేష్ కుకునూర్ కు కూడా బెస్టాఫ్ లక్ చెప్పాడు కింగ్ ఖాన్. 
 
ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లలో ప్రదర్శితమైన ఈ చలన చిత్రం.. ఇప్పుడు జూన 10న ఇండియా అంతటా రిలీజ్ కానుంది. గతంలో అమీర్ ఖాన్ తీసిన తారే జమీన్ పర్.. తరువాత వచ్చిన లంచ్ బాక్స్.. ఆ తరువాత తమిళంలో వచ్చిన కాక ముట్టయ్ సినిమాల తరహాలో ఈ సినిమాకు కూడా బాగా ఆడుతుందని అంచనా. 

Comments System

Disqus Shortname